మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎమ్మెల్యే రేఖా నాయక్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఖానాపూర్ నియోజకవర్గంలో చేపట్టిన మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, పల్లెప్రగతి, సంక్షేమ పథకాల అమలుపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
త్వరితగతిన పూర్తి చేయాలి..
ఖానాపూర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయాలని.. అసంపూర్తిగా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ అధికారులకు సూచించారు. పల్లెప్రగతి, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు. గ్రామాలలో చేపట్టిన డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలను వెంటనే పూర్తి చేయాలన్నారు.