నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలోని భైంసా, కుబీర్, తనూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. భైంసా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షానికి ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కురవడం వల్ల వ్యవసాయదారులు ఆనందం వ్యక్తం చేశారు. మరికొందరు కురిసిన వర్షానికి తమ పంటకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన సోయా పంటకు ఈ వర్షం చేటు చేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
'భైంసాలో వర్షం.. కొందరికి లాభం.. మరికొందరికి నష్టం'
వర్షానికి భైంసా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా కొంత మంది లాభం.. మరికొందరికి నష్టం' జరిగింది.
వర్షానికి భైంసా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం