నిర్మల్ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత గ్రామీణ ప్రజల రాక పెరిగిందని, ఫలితంగా రద్దీ ఎక్కువ అయిందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్మల్ పట్టణంలో ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
'పట్టణాలకొచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు' - Telangana forest minister indrakaran reddy
పట్టణాలకు వచ్చే గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజామరుగుదొడ్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాకేంద్రంలో పురపాలక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించారు.
నిర్మల్ పట్టణంలో ప్రజా మరుగుదొడ్లు
ప్రస్తుతం పట్టణంలో మూడు చోట్ల ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, మరో 25 నిర్మించేందుకు నిధులున్నాయని మంత్రి చెప్పారు. స్థల సేకరణ అనంతరం వాటి నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :గర్ల్‌ఫ్రెండ్ అమ్మమ్మను చంపి మైనర్ ఆత్మహత్య