నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్‌లో బుధవారం డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొవిడ్ వేషధారణ బొమ్మతో ప్రచారం చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్క్ ధరించకుండా... వ్యక్తిగత దూరం పాటించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కరోనా వైరస్ వేషధారణతో చేసిన ప్రచారం పలువురిని ఆకర్షించింది.
నిర్మల్‌లో పోలీసుల వినూత్న ప్రచారం - నిర్మల్‌లో పోలీసుల వినూత్న ప్రచారం
ప్రజల్లో కరోనా మహమ్మారిపై అవగాహన కలిపించేందుకు.. వారిలో మార్పు తెచ్చేందుకు వినూత్నంగా ఆలోచించారు నిర్మల్ జిల్లా పోలీసులు. కరోనా మహమ్మారి నివారణకై.. ప్రచారాన్ని వినూత్నంగా చేపట్టారు.
Innovative campaign in Nirmal