తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​పై పోలీసుల కళా జాత ప్రదర్శన

లాక్​డౌన్​ వేళ నిబంధనలు పాటించని వారి కోసం పోలీసులు.. కళా జాత ప్రదర్శనతో అవగాహన కల్పించారు. అత్యవసరముంటే తప్ప రోడ్ల మీదికి ఎవరూ రావొద్దని కోరారు. కరోనా కట్టడి కోసం పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలపై కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.

By

Published : Apr 27, 2020, 10:49 PM IST

POLICE DOING CORONA AWARENESS IN VERITY MANNER IN NIRMAL
లాక్​డౌన్​పై పోలీసుల కళాజాత ప్రదర్శన

నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్​డౌన్​పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. ఉదయం పూట ఇస్తున్నసడలింపు వల్ల వాహనాలపై జనం విచ్చలవిడిగా రోడ్డెక్కుతున్న నేపథ్యంలో పట్టణంలోని శివాజీచౌక్​లో కళాజాత బృందంతో ప్రదర్శన నిర్వహించారు.

ప్రజలు రహదారిపైకి వస్తే కరోనా వైరస్ సోకుతుందని... అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలోనే ప్రజలు బయటకు వెళ్లాలని, భౌతికదూరం పాటించాలని తెలిపారు. కరోనా వైరస్​పై పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రదర్శించారు. ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:కోపంతో నిద్రపోవడం అంత మంచిది కాదు!

ABOUT THE AUTHOR

...view details