ద్విచక్ర వాహనదారులు.. ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రొ. జయశంకర్ చౌరస్తాలో వాహనదారులకు అవగాహన కల్పించారు.
'హెల్మెట్‌తో పాటు.. లైసెన్స్, ఆర్సీలు తప్పనిసరి' - రోడ్డు భద్రతా మాసోత్సవాలు
32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.
'హెల్మెట్‌తో పాటు.. లైసెన్స్, ఆర్సీలు తప్పనిసరి'
ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను తప్పక పాటించాలని సీఐ పేర్కొన్నారు. హెల్మెట్ ధరిస్తూ.. లైసెన్స్, ఆర్సీలను కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించిన వాహనదారులుకు చాక్లెట్లు అందజేశారు.
ఇదీ చదవండి:లారీ ఢీకొని ఐదేళ్ల పాప మృతి