తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకలితో వెళ్లి.. కరెంటు స్తంభంలో ఇరుక్కొని.! - ox stuck in the current pole in nirmal district centre

ఆకలితో ఉన్న మూగజీవులకు ఆహారం కనపడితే చాలు అది ఎక్కడున్నా చొచ్చుకుపోయి తినేయాలనే ఆత్రుత ఉంటుంది. ఆ ఆత్రుతతోనే విద్యుత్‌ స్తంభం మధ్యలో కనిపించిన ఆహారాన్ని తినేందుకు వెళ్లి అందులో ఎద్దు ఇరుక్కుపోయింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది...

ox stuck in the current pole
కరెంటు స్తంభంలో ఇరుక్కున్న ఎద్దు

By

Published : Jun 4, 2021, 8:07 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రామీణ పోలీస్ స్టేషన్ సమీపంలోని విద్యుత్ స్తంభం మధ్య ఓ ఎద్దుకు ఆహారం కనిపించింది. ఎలాగైనా ఆకలి తీర్చుకోవాలని ఆ స్తంభం మధ్య తల దూర్చింది. తిన్న తర్వాత వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించగా అందులో ఇరుక్కుపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ.. ఎద్దు పరిస్థితి గమనించి దాని తల బయటకు తీయడానికి యత్నించారు. స్థానికుల సహాయంతో ఆ మూగజీవిని కాపాడారు.

ABOUT THE AUTHOR

...view details