నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నగర్ గ్రామంలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన గౌతమి, పూజలు తమకు ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్ కల్పించాలని గురువారం నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీని కలిసి వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వారికి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో అడ్మిషన్ ఇప్పించారు. చనిపోయిన పిల్లల తల్లి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని వారసత్వ పట్టా మార్పిడి చేయాలని, పిల్లలకు రైతు భీమా అందేలా చర్యలు తీసుకోవాలని, కొత్త రేషన్ కార్డు, స్త్రీ నిధి, పంట రుణం ఇప్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యను విని వెంటనే పరిష్కరించిన కలెక్టర్‌కు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్ కోసం... కలెక్టర్‌కు అనాథ పిల్లల వినతి! - నిర్మల్ కలెక్టర్
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు పిల్లలు తమకు ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్ కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పిల్లల వినతి పత్రం అందుకున్న కలెక్టర్ వెంటనే స్పందించి వారికి అడ్మిషన్ ఇప్పించారు. వారికి ఏం కావాలన్నా.. తనను సంప్రదించాలని.. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని కలెక్టర్ సూచించారు.
ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్ కోసం... కలెక్టర్‌కు అనాథ పిల్లల వినతి!