ప్రపంచ పర్యావరణ దినోత్సవం(world environment day) సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం వద్ద జేసీఐ భాగీరథి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీవో వేంకటేశ్వర్లు హాజరై మొక్కలు నాటారు. జేసీఐ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని వారు అన్నారు.
world environment day: మొక్కలు నాటిన అధికారులు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని(world environment day) నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం వద్ద జేసీఐ భాగీరథి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుందని వారు అన్నారు.
world environment day: మొక్కలు నాటిన అధికారులు
కరోనా సమయంలో ప్రతిరోజూ నిరుపేదలకు నిత్యాన్నదానం చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో జేసీఐ భాగీరథి అధ్యక్షురాలు వీణ, కార్యదర్శి మహేందర్, ఉపాధ్యక్షుడు భూమన్నయాదవ్, ఒడ్నం రాజేందర్, సంజీవ్, జైపాల్, ఉపాధ్యాయులు నర్సయ్య, సుజాత, మరియ, తదితరులు పాల్గొన్నారు.