యువకులు.. చదువుతో పాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్మల్ జడ్పీటీసీ సభ్యుడు జీవన్ రెడ్డి సూచించారు. సోన్ మండలంలోని బొప్పారం, న్యూ వెల్మల్ గ్రామాల్లోని క్రీడా మైదానాల్లో(Sports courts) ఏర్పాటు చేసిన క్రికెట్, వాలీబాల్, షటిల్ కోర్టులను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం.. క్రీడాకారులను గ్రామ స్థాయి నుంచే ప్రోత్సహించేందుకు ఆట స్థలాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
Sports courts: 'గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఆట స్థలాల ఏర్పాటు' - Nirmal zptc member
యువకుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఆట మైదానాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్మల్ జడ్పీటీసీ సభ్యుడు జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం.. క్రీడాకారులను గ్రామ స్థాయి నుంచే ప్రోత్సహించేందుకు ఆట స్థలాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. సోన్ మండలంలోని క్రీడా మైదానాల్లో(Sports courts) ఏర్పాటు చేసిన క్రికెట్, వాలీబాల్, షటిల్ కోర్టులను ఆయన ప్రారంభించారు.
sports courts
యువకులలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఆట మైదానాలు ఎంతో ఉపయోగపడతాయని జీవన్ రెడ్డి వివరించారు. అనంతరం క్రీడాకారులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Murder: ప్రియుడి మోజులో భర్తను చంపేసింది..