కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం ఆవశ్యకమని నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు పేర్కొన్నారు. ఈనెల 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 693 మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని.. వారిని గృహనిర్బంధం చేసి ప్రతిరోజూ మూడుసార్లు పరీక్షలు చేయిస్తున్నామన్నారు. కేవలం నిత్యావసర సరుకుల కోసమే బయటకు రావాలని కోరారు. ప్రజారవాణా వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు.
స్వీయ నియంత్రణే ఆవశ్యకం: ఎస్పీ
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ నెల 31వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.
స్వీయ నియంత్రణే ఆవశ్యకం: ఎస్పీ
అత్యవసర వైద్యసాయానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. దుకాణాల్లోనూ నలుగురికన్నా ఎక్కువగా గుమిగూడకుండా ఉండాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా తెరిచి ఉంచిన రెండు దుకాణాలపై కేసు నమోదుచేశామన్నారు.
ఇదీ చూడిండి:ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ మార్గదర్శకాలివే...
TAGGED:
స్వీయ నియంత్రణే ఆవశ్యకం