కరోనా వ్యాధిని నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యతని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ముందు చౌరస్తాలో కరోనా వ్యాధి నివారణపై అవగాహన చేపట్టారు. జాతీయ రహదారిపై నాలుగు వైపులా సిబ్బందితో ప్రచారం చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని అందరూ పాటించాలన్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.
'వైరస్ను నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యత'
కరోనా వ్యాధిని నివారణ చర్యల్లో భాగంగా రహదారిపై పోలీసుల వినూత్న ప్రచారం చేశారు. జనతా కర్ఫ్యూని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు.
'వైరస్ను నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యత'
TAGGED:
corona awareness