తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ ధరల ప్రకారమే కొవిడ్ చికిత్స అందించాలి' - నిర్మల్​ కరోనా కేసులు

కొవిడ్ చికిత్సకు అధిక డబ్బులు వసూలు చేసే ఆస్పత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో.. రెండో దశ పరిస్థితులపై ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, నిర్వాహకులతో కలెక్టరేట్​లో ఆయన సమావేశం నిర్వహించారు.

corona treatment cost
corona treatment cost

By

Published : May 6, 2021, 11:08 AM IST

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే కొవిడ్ చికిత్సలు అందించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. రెండో దశ పరిస్థితులపై.. కలెక్టరేట్​లో ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని వారికి సూచించారు.

చికిత్సకు అధిక డబ్బులు వసూలు చేసే ఆస్పత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.ధనరాజు, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 6,026 కరోనా కేసులు, 52మరణాలు

ABOUT THE AUTHOR

...view details