నిర్మల్ జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి దసరా నాటికి వందశాతం పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో రైతు వేదికల నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 79రైతు వేదికల నిర్మాణపనులను వెంటనే ప్రారంభించి దసరా నాటికి వందశాతం పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికబద్ధంగా పనిచేసి నిర్మాణపనులు పూర్తి చేయాలని సూచించారు.
జిల్లాలో దసర నాటికి వందశాతం రైతువేదికలను నిర్మించాలి: కలెక్టర్ - నిర్మల్ జిల్లా వార్తలు
నిర్మల్ జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 79 రైతు వేదికల నిర్మాణాలను దసరా నాటికి వందశాతం పూర్తి చేయాలన్నారు. జిల్లాకు మంజూరైన 3వేల రైతు వ్యవసాయ కల్లాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
నిర్మాణపనులలో సిమెంట్, ఇసుక, స్టీల్ అందడంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకి మంజూరైన 3వేల రైతు వ్యవసాయ కల్లాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ, ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకు వెంటనే స్థలాలను గుర్తించి నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రావు, వ్యవసాయశాఖ ఏడీలు వినయ్ బాబు, వీణా, ఏఓ, ఏఈఓ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ