తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షా సమావేశం - నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ

ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం ధర్మసాగర్ చెరువు గట్టుపై జాతీయ పతాకం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.

nirmal collector review meeting
ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షా సమావేశం

By

Published : Jul 17, 2020, 10:11 AM IST

నిర్మల్ కలెక్టరేట్​లో గురువారం ప్రభుత్వ పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు, డంపింగ్ యార్డు స్మశాన వాటికలు, రైతు కల్లాల నిర్మాణాలను వేగవంతం అయ్యేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.

మీసేవ దరఖాస్తులను, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తమ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేసేలా రెవెన్యూ అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువు గట్టుపై జాతీయ పతాకం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.

ఇవీ చూడండి:కొందరిలో కొవిడ్‌ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్‌..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details