తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆస్తుల వివరాల నమోదును పకడ్బందీగా చేపట్టండి'

నిర్మల్ జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు నిర్వహణపై కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ.. సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తుల వివరాల నమోదును వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు.

'ఆస్తుల వివరాల నమోదును పకడ్బందీగా చేపట్టండి'
'ఆస్తుల వివరాల నమోదును పకడ్బందీగా చేపట్టండి'

By

Published : Oct 7, 2020, 6:44 PM IST

నిర్మల్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదును పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సర్వే ప్రక్రియలో భాగంగా ఆస్తుల వివరాల నమోదును వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో లక్షా 75 వేల కుటుంబాలకు గాను కేవలం 40 వేల కుటుంబాలకు మాత్రమే సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.

గురువారం నుంచి ఒక్కొక్క సర్వే బృందం రోజుకు కనీసం 60 సర్వేలు నిర్వహించాలని సూచించారు. యజమానికి సంబంధించిన అన్ని వివరాలను పక్కాగా ఆన్ లైన్​లో నమోదు చేయాలన్నారు. సర్వే కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు రోజూ పర్యవేక్షించాలని సూచించారు.

ఇదీ చదవండి:ట్రాక్టర్​ నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ

ABOUT THE AUTHOR

...view details