కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో రహదారులపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు నిర్మల్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
ఆహార పొట్లాలు పంపిణీ చేసిన నిర్మల్ సేవాసమితి - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
యాచకులు, నిరాశ్రయులకు నిర్మల్ సేవాసమతి ఆధ్వర్యంలో ఉచితంగా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. రహదారిపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజనం అందించారు.
ఆహార పొట్లాలు పంపిణీ చేసిన నిర్మల్ సేవాసమితి
యాచకులు, నిరాశ్రయులకు కూడా భోజనం అందించారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం అందిస్తామని సేవాసమితి గౌరవ అధ్యక్షులు నార్లపురం రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ వెంకటేశ్, ట్రాఫిక్ ఎస్సై దేవేందర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'తొమ్మిదేళ్లుగా విధుల్లో భార్యకు బదులు భర్త'.. కలెక్టర్కు ఫిర్యాదు