నిర్మల్లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం - kuntala
రెండో విడత ఎన్నికల సమరానికి నిర్మల్ సిద్ధమవుతోంది. మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని ఎస్పీ శశిధర్ రాజ్ తెలిపారు.
ప్రశాంతంగా రెండో విడత నామినేషన్లు
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని కుంటల, లోకేశ్వరం రెండో విడత ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈ మండలాల్లో రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీల మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎస్పీ శశిధర్ రాజ్ కుంటల ఎంపీడీఓ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. నిర్మల్ జిల్లాలో రెండో విడతలో 6 మండలాల్లో నామపత్రలాల స్వీకరణ కొనసాగుతుందన్నారు. నామినేషన్ కేంద్రం నుంచి వంద మీటర్ల వరకూ 144 సెక్షన్ అమలులో ఉందని ఎస్పీ తెలిపారు.