తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరమని ఐసీడీఎస్ అధికారులు సూచించారు. నిర్మల్ జిల్లా ముథోల్, లోకేశ్వరం, కుంటల, కుభీర్, తనూర్ మండలాల్లోని అంగన్వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముథోల్ మండలంలోని తారోడాలో గర్భిణీలకు అంగన్వాడి టీచర్లు, అధికారిణిలు సామూహిక సీమంతం జరిపారు. పసిపిల్లలకు సామూహిక అన్నప్రాసన చేశారు. గర్భిణీలు, బాలింతలు చేసే పనులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి రోజు అంగన్వాడి కేంద్రానికి వచ్చి పాలు, ఆహారం తీసుకోవాలని సూచించారు.
తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం...
నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో తల్లి పాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.
Mother's milk weekends in nirmal