తెరాస సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని చింతకుంటవాడ 40,42 వార్డుల్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని కార్యకర్తలకు మంత్రి సూచించారు.
స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషం : ఇంద్రకరణ్ రెడ్డి - party membership programme in nirmal district
పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని చింతకుంటవాడలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి తెరాస కార్యకర్త నమోదు చేసుకోవడంతో పాటు, ప్రజలు సభ్యత్వాన్ని పొందేలా చూడాలన్నారు. అనుకున్న లక్ష్యానికి కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్ర ఈశ్వర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.