తెలంగాణ

telangana

By

Published : Jun 12, 2021, 2:55 PM IST

ETV Bharat / state

Minister indrakaran reddy: కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. టీకా తీసుకునేందుకు వచ్చిన వారంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

minister indrakran reddy visited corna vaccine center at nirmal
కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం సందర్శించారు. వ్యాక్సిన్​పై ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా టీకా పంపిణీ చేస్తుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పేర్కొన్నారు.

టీకాలు తీసుకునేందుకు వచ్చిన అర్హులందరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details