జూన్ 20 లోగా రైతులు నాట్లు వేస్తే బ్రహ్మాండమైన దిగుబడి వస్తుందని పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్‌లోని గాజులపేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులు సకాలంలో తుకాలు పోసి.. నాట్లు వేస్తే ధాన్యం అధిక దిగుబడి వస్తుందని వివరించారు.
'రోహిణి కార్తెలో తుకాలు, జూన్ 20లోగా నాట్లు వేయండి'
నిర్మల్‌లోని గాజులపేటలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులు సకాలంలో తుకాలు పోసి అధిక దిగుబడి రాబట్టాలని మంత్రి సూచించారు.
'రోహిణి కార్తెలో తుకాలు, జూన్ 20లోగా నాట్లు వేయండి'
భూగర్భ జలాలు పెరిగిపోయాయని, ప్రభుత్వం రైతు బంధు అందిస్తోందని తెలిపారు. రూ. 25 వేల లోపు ఉన్న రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. 17 శాతం లోపు తేమ ఉన్నా... ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు సూచించారు. గన్నీ సంచుల కొరత లేదని, ట్రాన్స్పోర్ట్, రైస్ మిల్లులకుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు మంత్రి.