నిర్మల్ జిల్లాలోని చిట్యాల గ్రామ సమీపంలో స్వర్ణ వాగుపై రూ.4.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సాగునీటి కోసం తలపెట్టిన ప్రాజెక్టులు, చెక్ డ్యాంల నిర్మాణాల వల్ల రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కేటగిరీల వారీగా వాగులను విభజించి వాటిపై చెక్ డ్యాంలను నిర్మించి భూగర్భ జలాలను నిక్షిప్తం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించారని తెలిపారు.
చెక్‌డ్యామ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన - minister indrakaran reddy latest news
సమృద్ధిగా పంటలు పండించేందుకు వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని కోటి ఎకరాలకు నీరందించే విధంగా సీఎం కేసీఆర్ సాగునీటి రంగ నిపుణులతో చర్చించి ప్రణాళికలు రూపొందించారన్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో అవసరం ఉన్న చోట్ల చెక్ డ్యాం నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వీటి ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, అంతేకాక మోటార్ల ద్వారా కూడా రైతులు సాగు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల్లో, వాగుల్లో 365 రోజులు నీరు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కె.విజయలక్ష్మి, నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, సర్పంచ్ రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'