వ్యవసాయానికి నిరంతరంగా సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ సరస్వతి కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని శాస్త్రీనగర్లోని తన నివాసంలో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సరస్వతి కాలువ నుంచి చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని పెంబి మండల రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి అధికారులతో చర్చించారు. సరస్వతి కాలువపై గాంధీనగర్ సమీపంలో ఆనకట్ట నిర్మించి తాగు, సాగునీటిని మళ్లించడం వల్ల 1500లకు గానూ 1000 క్యూసెక్కుల నీటినే రైతులకు అందించాగలుగుతున్నామని అధికారులు వివరించారు.