తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసర సరస్వతీ ఆలయ పునర్నిర్మాణ పనులు షురూ.. - మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి వార్తలు

Basara Saraswathi Temple Reconstruction: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇటీవల ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Basara Saraswathi Temple Reconstruction
Basara Saraswathi Temple Reconstruction

By

Published : Mar 24, 2023, 2:27 PM IST

బాసర సరస్వతి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం.. యాదాద్రి మాదిరిగానే!

Basara Saraswathi Temple Reconstruction: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్​రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వారి ఆల‌య పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సరస్వతీ అమ్మవారి గర్భాలయ పునః నిర్మాణంతో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నులకు ఎమ్మెల్యే విఠ‌ల్​రెడ్డితో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్​రెడ్డి శుక్ర‌వారం భూమి పూజ చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో: ఇప్పటికే రూ.8 కోట్లతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులు చేప‌ట్ట‌గా.. ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని రూ.22 కోట్లతో కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో ఆలయ అభివృద్ది చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్ర‌మంలో క‌లెక్ట‌ర్ వ‌రుణ్​రెడ్డి, ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి విజ‌యరామారావు, ఇత‌ర అధికారులు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Saraswathi Temple Reconstruction: దక్షిణ భారతావనిలోని ప్రసిద్ధ చదువుల క్షేత్రం బాసరలో సరికొత్తగా ఆలయాన్ని నిర్మించేందుకు దేవాదాయ శాఖ కసరత్తు ప్రారంభించిన విషయం విధితమే. మహా సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవారు కొలువైన క్షేత్రం ఈ బాసర. మహంకాళి విగ్రహం ఇప్పుడు పైన అంతస్తులో ఉంది. ఇప్పుడైతే.. గర్భ గుడిలోని మహా సరస్వతీ విగ్రహానికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆగమ శాస్త్రం ప్రకారం.. సరస్వతీ అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ఉండాలి.

అయితే ఇప్పుడు భక్తులు ప్రత్యేకంగా చూస్తే తప్ప మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కనబడదు. అందుకని ఇప్పుడున్న ప్రాకార మండపాన్ని అక్కడ్నుంచి పూర్తిగా తొలగించి కొత్త మండపాన్ని చేపట్టే ప్రణాళిక రూపొందుతోంది. ప్రాకార మండపానికి తూర్పు/ పశ్చిమ దిశలో 7 అంతస్తులతో రెండు రాజ గోపురాలు, ఉత్తర/ దక్షిణ దిశల్లో 5 అంతస్తులతో మరో రెండు రాజగోపురాలు నిర్మించేందుకు యోచిస్తున్నారు. గర్భగుడే కాకుండా పూర్తిగా ఆలయాన్నంతా యాదాద్రి మాదిరిగా మొత్తం కృష్ణ శిలలతోనే నిర్మించాలనే ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పుతో ఉన్న గర్భగుడి 25.5 అడుగుల వెడల్పు, 16.5 అడుగుల పొడవు పెరగనుంది. 6.5 అడుగుల వెడల్పున్న ముఖద్వారాన్ని 18.5 అడుగులకు పెంచాలని ఆ శాఖ చూస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details