ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటిస్తూ... వాహనాలు నడపాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద లారీ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించారు.
'నిబంధనలు పాటిస్తేనే.. రోడ్డు ప్రమాదాల నియంత్రణ'
నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద లారీ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ప్రజా మరుగుదొడ్లను మంత్రి ప్రారంభించారు.
అనంతరం లాక్డౌన్ నేపథ్యంలో లారీ వాహనాలకు 6 మాసాల పన్నును ప్రభుత్వం రద్దు చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రోజురోజుకు వాహన రద్దీ పెరుగుతుందని... వాటితో పాటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదాల నివారణ కోసం వాహన చోదకులంతా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. లారీ యాజమాన్యం సంఘటితంగా ఉండి వ్యాపారంలో ముందుకు పోవాలన్నారు. లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపాల్ ఛైర్మన్ ఈశ్వర్, సోన్ జడ్పీటీసీ జీవన్ రెడ్డి, నిర్మల్ కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్, పూదరి రాజేశ్వర్, ఎంవీఐ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'అధిక ఫీజులు వసూలు చేస్తే తిరిగి చెల్లించేలా ఆదేశాలు'