నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు త్వరలో పక్కా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా చిట్యాల్ గ్రామంలో రూ. 26 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను గ్రామస్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
నూతన పంచాయతీలకు పక్కా భవనాలు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి - మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ జిల్లా చిట్యాల్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
నూతన పంచాయతీలకు పక్కా భవనాలు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి