వరి ధాన్యం కొనుగోళ్లు జూన్ 5 వరకు పూర్తి చేయాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. వర్షాలు ప్రారంభం కాకముందే కొనుగోళ్లు పూర్తవ్వాలని అన్నారు. జిల్లాలో 1,54,440 మెట్రిక్ టన్నులు లక్ష్యం కాగా... ఇప్పటి వరకు 1,32,332 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయండి: ఇంద్రకరణ్రెడ్డి
ధాన్యం కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. వర్షాలు పడకముందే కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవ్వాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయండి: ఇంద్రకరణ్రెడ్డి
జిల్లాలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా తమ పనులు సజావుగా చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇన్ఛార్జీ ఎస్పీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు