నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో స్ఫూర్తి, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 135 మంది అర్చకులు, ప్రైవేట్ టీచర్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy) నిత్యావసర సరకులు అందించారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన అర్చకులు, ఉపాధ్యాయులకు ఫౌండేషన్ సభ్యులు నరేశ్, డాక్టర్ ప్రవీణ్ సాయం చేయడం అభినందనీయమన్నారు.
Indrakaran Reddy: నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తాజా వార్తలు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy) నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో స్ఫూర్తి, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయిన వారికి ఫౌండేషన్ సభ్యులు నరేశ్, ప్రవీణ్ సాయం చేయడం గొప్ప విషయమన్నారు.
Indrakaran Reddy: నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి
ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకుందన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి నరేశ్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ నెలకు తనకు తోచినంత సహాయం చేయడంతో అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?