రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందజేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సబ్సిడీపై జీలుగు విత్తనాలను రైతులకు పంపిణీ చేసి మాట్లాడారు.
రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం: మంత్రి ఇంద్రకరణ్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సబ్సిడీపై జీలుగు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వెల్లడించారు.
గతంలో సకాలంలో సబ్సిడీ విత్తనం దొరక్క దళారులు, ప్రైవేటు ఏజెన్సీల ఉచ్చులో పడి.. రైతులు ఏటా వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడిని నష్టపోయేవారన్నారని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. జిల్లాలో రైతులకు ప్రస్తుతం 4వేల 500 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఇంకా అవసరమైతే తెప్పియడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 45 కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీకి సౌలభ్యం ఉందని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాయితీ మీద ప్రభుత్వం ఒక కోటీ యాభై ఆరు లక్షల 45 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. 30 కేజీల బస్తా ధర 1605 రూపాయలు కాగా రాయితీ ద్వారా 1043 రూపాయలు మొత్తంగా రైతుకు 562 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుష్ వైద్య విధానంలో చికిత్స