తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - minister indra karan reddy

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

minister indra karan reddy cleaned his houseminister indra karan reddy cleaned his house
పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

By

Published : May 10, 2020, 1:31 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు కూడా పాల్గొని మొక్కలకు నీళ్లు పట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న బావిలో బ్లీచింగ్ పౌడర్ వేశారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యర్థపు నీటిని, పూల కుండీల్లో ఉన్న నీటిని తొలగించారు.

మొదట ప్రజా ప్రతినిధులు ప్రతీ ఆదివారం ఓ పది నిమిషాలు కేటాయించి తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. అప్పుడే ప్రజలు కూడా పాటిస్తారని అన్నారు. ఇప్పటికే కరోనా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుందని, ఇలాంటి సమయంలో విషజ్వరాల బారిన పడి ముప్పు తెచుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్, తెరాస పట్టణ అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:మాజీ మంత్రి రత్నాకర్​రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ABOUT THE AUTHOR

...view details