తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ: మంత్రి అల్లోల - రాజరాజేశ్వరి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి

రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ రానుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్​లో రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రాజరాజేశ్వరి ఆలయ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.

రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ: మంత్రి అల్లోల
రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ: మంత్రి అల్లోల

By

Published : Sep 13, 2020, 4:18 PM IST

రాష్ట్రంలోని దేవాలయాలకు మంచిరోజులు రానున్నాయని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఆలయాలను నిర్మించుకున్నామని గుర్తుచేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్​లో రూ.15లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రాజరాజేశ్వరి ఆలయనిర్మాణానికి భూమిపూజ చేశారు.

రాష్ట్రంలో దాదాపు 400 ఆలయాలకు నిధులు మంజూరు చేశామన్నారు. నిరాదరణకు గురైన ఆలయాలకు దూపదీప నైవేద్యం పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మాజీ డీసీసీబీ ఛైర్మన్ రాంకిషన్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు... కసరత్తు ప్రారంభించిన అధికారులు...

ABOUT THE AUTHOR

...view details