ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు (Raithu bandhu) డబ్బులు జమ అవుతాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం వడ్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదిక ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.
Raithu vedika: రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ - raithu vedika
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలో పర్యటించారు. వడ్యాల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు వేదికను ఆయన ప్రారంభించారు. తెరాస ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి వివరించారు.
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని మంత్రి అన్నారు. కరోనా కష్ట కాలంలోనూ పెట్టుబడికి ఇబ్బంది లేకుండా రైతుబంధు కింద సాయం అందిస్తోందని చెప్పుకొచ్చారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాజేశ్వర్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి, డీసీసీబీ వైస్ ఛైర్మన్ రఘు నందన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Vinodkumar: లాక్‌డౌన్ వల్ల కొన్ని నష్టాలు.. మరికొన్ని లాభాలు