రైతుల కోసం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 79 రైతు వేదిన భవనాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదిక భవనానికి మంత్రి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ భవనాలన్నింటినీ దసరా వరకు పూర్తి చేస్తామన్నారు.
రైతుల సంఘటితానికే రైతు వేదికలు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి - తెలంగాణ తాజా వార్తలు
రైతుల సంఘటితానికే రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రైతు వేదిక భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
రైతుల సంఘటితానికే రైతు వేదికలు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
జిల్లా కేంద్రంలోని గొల్లపేట కాలనీలో ఇటీవల మృతి చెందిన సత్యనారాయణ మృతికి పరిహారంగా.. 5 లక్షల రైతు భీమా చెక్కును ఆయన భార్య లక్ష్మికి అందజేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని రైతు భీమా పథకం అందజేయడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...