రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని సిద్ధాపూర్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
'రైతులను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం' - indrakaran reddy
రైతులను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
రైతుల బలోపేతం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి కొనియాడారు. లాక్డౌన్ వల్ల రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదనే రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికి ఉచిత బియ్యం, నగదు అందించామని తెలిపారు. రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, పలువురు వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.