కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్లో పురపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో మంత్రి పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. ఐకే ఫౌండేషన్ తరఫున 360 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, శానిటైజర్లు అందజేశారు. అనంతరం కార్మికులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహపంక్తి భోజనం చేశారు.
మేడే సందర్భంగా కార్మికులతో మంత్రి సహపంక్తి భోజనం - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిత్యావసర సరుకులు, శానిటైజర్లు అందజేశారు. వారితో సహపంక్తి భోజనం చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అంతకు ముందు నిర్మల్, లక్ష్మణ చందా, సోన్ మండలాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ ఛైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, శానిటరీ ఇనిస్పెక్టర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే...