తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసకు కార్యకర్తలే బలం: మంత్రి ఇంద్రకరణ్​ - trs

తెరాస ఆవిర్భావ దినోత్సవం నిర్మల్​లో ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుపై దేశమంతా ఆసక్తి చూపిస్తుందని ఇంద్రకరణ్​ పేర్కొన్నారు.

నిర్మల్ లో ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం

By

Published : Apr 27, 2019, 2:15 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసం ముందు తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసిన మంత్రి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ గీతాన్ని ఆలపించి వందనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 18 సంవత్సరాల క్రితం గుప్పెడు మందితో ప్రారంభించిన తెరాస పార్టీ నేడు లక్షల మంది కార్యకర్తలతో ముందుకు వెళ్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తెరాసకు కార్యకర్తలే బలం అని తెలిపారు.

నిర్మల్ లో ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details