తెలంగాణ

telangana

ETV Bharat / state

జయశంకర్ ఆశయసాధనకు కృషి చేద్దాం : కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ - జయశంకర్

నిర్మల్ జిల్లా కలెక్టరేట్​లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ స్పష్టం చేశారు.

జయశంకర్ ఆశయసాధనకు కృషి చేద్దాం : కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ
జయశంకర్ ఆశయసాధనకు కృషి చేద్దాం : కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ

By

Published : Aug 6, 2020, 3:05 PM IST

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ జయశంకర్ ఆసయ సాధనకు కృషి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు.

దశదిశ మహనీయుడని...

తెలంగాణ సమాజానికి దశదిశ చూపిన మహనీయుడని కొనియాడారు. ఆయన కలలను సాకారం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి సోమేశ్వర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్ కుమార్, కలెక్టర్ కార్యాలయ ఏఓ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'శాంతిభద్రతల స్థాపనలో ఐపీఎస్​ల పాత్ర కీలకం'

ABOUT THE AUTHOR

...view details