వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల చేపట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వామపక్ష నాయకుల ఆందోళన, అరెస్ట్
భారత్ బంద్‌లో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. వీరిని పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
bharat band at nirmal district
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. భాజపా ప్రభుత్వం పెట్టుబడి దారులకు దేశ సంపదను దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆరోపించారు. దిల్లీ సరిహ్దదులో రైతులు నిరసన చేస్తున్నప్పటికీ... ప్రధాని మోదీకి చీమకుట్టినట్టుగా కూడా లేకపోవడం దారుణమన్నారు.
ఇదీ చదవండి:321.98 కోట్ల ఆదాయానికి గండి: కాగ్