నిర్మల్ జిల్లా కౌట(కె) గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆదివాసీల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుడు కుమురం భీం అని కొనియాడారు.
ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం : మాజీ ఎమ్మెల్యే - నిర్మల్ జిల్లా తాజా సమాచారం
ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన యోధుడు కుమురం భీం అని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కౌట(కె) గ్రామంలో ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం : మాజీ ఎమ్మెల్యే
ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుమురం భీం ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పోరాటం చేయాలని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు భూమయ్య, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, దిలావర్పూర్ జడ్పీటీసీ రమణరెడ్డి, సోన్ ఎంపీపీ మానస హరీశ్‌రెడ్డి, మండల అధ్యక్షులు జమాల్, నాయకులు పాల్గొన్నారు.