తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మికుల యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి - indrakaran reddy news

హైదరాబాద్ నుంచి కాలిబాటన, మోటారు సైకిళ్లపై, ఇతర వాహనాల ద్వారా సొంత రాష్ట్రానికి వెళ్తోన్న 155 మంది వలస కార్మికులకు నిర్మల్​ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్​లో వసతి కల్పించారు. వీరందరిని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

indrakaran reddy meets migrated labor
కార్మికుల యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి

By

Published : Mar 31, 2020, 7:17 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు వలస కార్మికులకు భోజన సౌకర్యాలు కల్పించడం జరిగిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్​లో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను మంత్రి కలిశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కాలిబాటన, మోటారు సైకిళ్లపై, ఇతర వాహనలపై వెళ్తున్న 155 మంది వలస కార్మికులకు దివ్యగార్డెన్​లో వసతి కల్పించారు. వీరందరికి భోజన సౌకర్యాలు కల్పించారు.

విరాళాలు అందజేత..

వైరస్​ నివారణకు పలువురు దాతలు నిర్మల్ జిల్లా కలెక్టర్ సహాయనిధికి విరాళాలు అందజేశారు. నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీ వాసులు రూ.2 లక్షల చెక్కు, రవి స్కూల్ తరపున కరస్పాండెంట్ ఏ.వెంకటేశ్వర్లు రూ.లక్ష చెక్కు, వశిష్ఠ విద్యాసంస్థల యాజమాన్యం సత్యనారాయణ గౌడ్, సరోత్తం రెడ్డి రూ. 50వేల చెక్కును పాలానాధికారి అందజేశారు. మాజీ సైనికులు తరపున యూనియన్​ అధ్యక్షులు కె.భూపాల్ రెడ్డి, బి.శ్రీనివాస్ రూ.30 వేలు కలెక్టర్​కు అందజేశారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం దాతలు విరాళాలు అందించడం అభినందనీయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

కార్మికుల యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి

ఇవీ చూడండి:కరోనా మమ్మల్నేం చేస్తది.. ఫొటో కావాలి మాకూ..

ABOUT THE AUTHOR

...view details