తెలంగాణ

telangana

ETV Bharat / state

గెలిపించాలి... బహుమతిగా అందించాలి: ఇంద్రకరణ్​ - indrakaran

నిర్మల్​ జిల్లాలో తెరాస నాయకుల ప్రచారం జోరుగా సాగుతోంది. గత రెండు రోజులుగా ఎంపీ అభ్యర్థి నగేశ్​తో పాటు మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ లక్ష్మణచంద్ర, నిర్మల్​, దిలావర్పూర్​, నర్సాపూర్​ మండలాల్లో పర్యటించారు.

ఇంద్రకరణ్​ రెడ్డి

By

Published : Mar 28, 2019, 12:44 AM IST

గెలిపించాలి... బహుమతిగా అందించాలి: ఇంద్రకరణ్​
16 స్థానాలే ధ్యేయంగా తెరాస నాయకులు ప్రచారాన్ని సాగిస్తున్నారు. నిర్మల్​ జిల్లాలో గులాబీ పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత రెండు రోజులుగా మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ఆదిలాబాద్​ ఎంపీ అభ్యర్థి నగేశ్​తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ప్రచార హోరు

లక్ష్మణ చాందా, నిర్మల్​, దిలావర్పూర్​, నర్సాపూర్​ మండలాల్లో మంత్రి ప్రచారాన్ని నిర్వహించారు. నిర్మల్​ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్​లో ఏర్పాటు చేసిన తెరాస కార్యకర్తల సమావేశానికి ఇంద్రకరణ్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


కాంగ్రెస్​ ఖాళీ

ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని మంత్రి అన్నారు. భవిష్యత్తులో హస్తం పార్టీకి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకరని జోస్యం చెప్పారు. తెరాస నుంచి పోటీ చేస్తున్న నగేశ్​ను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్​కు బహుమతిగా అందించాలని కార్యకర్తలకు సూచించారు.ఈ సమావేశంలో పలువురు సర్పంచులుతో పాటు ఇతర పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు.

ఇవీ చూడండి:శరత్​.... నేను కేసీఆర్​ను మాట్లాడుతున్నా...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details