నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో వాన కోసం రైతులు ఊరి కందోరి పేరిట ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని కొండలవాడికి చెందిన శిక్షణ పొందిన గుర్రంతో నృత్యం ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటలపాటు డప్పుల శబ్దానికి అనుగుణంగా గుర్రం లయబద్ధంగా డ్యాన్స్ చేసింది. అనంతరం గ్రామస్థులంతా కలిసి సహాపంక్తి భోజనాలు చేశారు.
వాన కోసం గుర్రం నృత్యం
గుర్రం.. దానిపై ఓ బాలుడు... లయబద్ధకంగా డప్పుల శబ్దం... దానికి అనుగుణంగా గుర్రం నాట్యం... ఇదంతా ఎందుకో తెలుసా వర్షం కోసమే.. ముఖం చాటేసిన వాన కోసం రైతులు ఎన్నో పూజలు చేస్తున్నారు. నిర్మల్ జల్లా లోకేశ్వరంలో వాన కోసం ఊరి కందోరి పేరిట ప్రత్యేక పూజలు చేశారు.
నృత్యం చేస్తున్న గుర్రం