నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 19 కేసులు పాజిటివ్ రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కరోనా వ్యాధి వ్యాపించిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ పాలనా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమయ్యారు. చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మే 3 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా, బయటి వారు ఆ ప్రాంతాలకు రాకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు.
మే 3 వరకు ఇళ్లకే పరిమితం కావాలి : మంత్రి ఇంద్రకరణ్ - minister indrakarn reddy
నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కరోనా వ్యాధి నివారణ చర్యల గురించి సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు. మే 3 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.
మే 3 వరకు ఇళ్లకే పరిమితం కావాలి : మంత్రి ఇంద్రకరణ్
నిర్మల్ జిల్లా రెడ్ జోన్ కావడం వల్ల ఇంటింటికి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిస్తున్నామని తెలిపారు. పోలీసులు, వైద్యులు, అధికారుల సూచనలు ప్రతి ఒక్కరూపాటించి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ