తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: మహమూద్‌ అలీ - home minister mahamood ali news

భైంసాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని హోం మంత్రి మహమూద్‌ అలీ వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు హోం మంత్రి ట్విట్టర్‌ ద్వారా బదులిచ్చారు.

riots in bhaimsa, mahammod ali
భైంసాలో అల్లర్లు, మహమూద్‌ అలీ

By

Published : Mar 8, 2021, 4:24 PM IST

నిర్మల్‌ జిల్లా భైంసాలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన అల్లర్ల ఘటనపై ఎస్పీ, డీజీపీ, జిల్లా కలెక్టర్‌తో చర్చించానని వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హో మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలతో మాట్లాడినట్లు తెలుపుతూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు... ఆయన బదులిచ్చారు. భైంసాలో ప్రస్తుతం అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు హోం మంత్రి మహమూద్‌ అలీ స్పందన

ఇదీ చదవండి:పోలీసుల నిఘా నీడలో భైంసా పట్టణం

ABOUT THE AUTHOR

...view details