తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్ చేపల మార్కెట్​లో రద్దీ - తెలంగాణ వార్తలు

మృగశిర కార్తె సందర్భంగా చేవలు మార్కెట్లు కిటకిటలాడాయి. నిర్మల్ జిల్లాకేంద్రంలోని చేపల మార్కెట్​లో రద్దీ నెలకొంది. కొనుగోలుదారులు మార్కెట్లలో కరోనా నిబంధనలు గాలికొదిలేశారు.

heavy rush at fish market, nirmal fish market
చేపల మార్కెట్లు కిటకిట, నిర్మల్ చేపల మార్కెట్

By

Published : Jun 8, 2021, 1:07 PM IST

మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చేపల మార్కెట్ కొనుగోలుదారులతో సందడిగా మారింది. వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలను తీసుకొచ్చి విక్రయించగా... కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

మృగశిర కార్తె ప్రభావంతో చేపల ధరలను పెంచినట్లు కొనుగోలుదారులు వాపోయారు. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కరోనా నిబంధనలను గాలికొదిలేశారు.

ఇదీ చదవండి:Sand Art: సాగర దినోత్సవంపై సందేశం

ABOUT THE AUTHOR

...view details