తెలంగాణ

telangana

ETV Bharat / state

Grain purchases issues: ధాన్యం ఒకరిది .. డబ్బులు మరొకరికి..! - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఐకమత్యంగా ఉన్న ఆ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఓ పెద్ద చిచ్చును రేపింది. కొనుగోలు కేంద్రం(Grain purchases issues) నిర్వాహకుడు చేసిన పొరపాటుతో అన్నదమ్ముల్లా ఉన్న రైతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్మల్ జిలా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో తలెత్తిన ధాన్యం వివాదం పక్షం రోజులుగా రోజుకో రీతిలో ముదురుతోంది.

Grain purchases issues, nirmal district grain purchases
కన్కూపూర్‌లో ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు

By

Published : Aug 20, 2021, 2:24 PM IST

Updated : Aug 20, 2021, 4:20 PM IST

కనకాపూర్​లో ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు

నిర్మల్ జిలా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో తలెత్తిన ధాన్యం వివాదం(Grain purchases issues) పక్షం రోజులుగా ముదురుతూనే ఉంది. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు చేసిన పొరపాటుతో తలెత్తిన వివాదం గ్రామస్థులను రెండు వర్గాలుగా చీల్చింది. ఒక వర్గం వారు అకారణంగా జరిమానాలు విధించి... తమను బహిష్కరించారంటూ ఆరోపిస్తున్నారు. మరో వర్గం వారు తాము నచ్చని వారితో మాట్లాడడం లేదని... ఎలాంటి బహిష్కరణలు చేయలేదని చెబుతున్నారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఏం జరిగింది?

ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతులు తమకు డబ్బులు తక్కువ వచ్చాయని నిర్వాహకుడిని నిలదీయగా... ఆయన నిరక్ష్యంగా సమాధానం చెప్పడం వల్ల ఈ పరిణామాలు తీవ్రరూపం దాల్చాయని స్థానికులు అంటున్నారు. ఈ సమస్యను కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి విచారణ జరపాలని కోరారు. తరుగు పేరుతో భారీగా కోతలు విధించి... ఆ డబ్బులను నిర్వాహకుడు బినామీల ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు రైతులు వినతిపత్రంలో ఆరోపించారు. దీనిపై ఈనాడు- ఈటీవి భారత్ పరిశీలన చేయగా పలు విషయాలు వెల్లడయ్యాయి.

పట్టా ఒకరిది .. సొమ్ము మరొకరికి ..

గ్రామంలో ఎత్తిపోతల పథకం ఉండడంతో సాగు భూమిలో దాదాపు 80 శాతానికి పైగా వరి పంటనే సాగు చేస్తారు. ధాన్యం దిగుబడులూ అధికమే. కాగా యాసంగిలో పండించిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. ధాన్యంలో తేమ, తాలు పేరుతో క్వింటాకు కిలో నుంచి 7 కిలోల వరకు కోత విధించారని రైతులు తెలిపారు. డబ్బులు తక్కువ రావడంతో అనుమానం వచ్చిన రైతులు జిల్లా కార్యాలయానికి వెళ్లి రికార్డులను తెచ్చి పరిశీలించారు. లారీలో నలుగురు రైతుల సరుకు వెళ్లగా ఐదుగురి పేరిట నమోదై ఉందని చెప్పారు. ఇలా ప్రతి లారీలో కోతలు విధించిన ధాన్యం డబ్బులను బినామీల పేరిట పలుమార్లు తూకం వేశారని ఆరోపించారు. ఆ డబ్బులను బినామీల ఖాతాల్లోకి మళ్లించినట్లు పరిశీలనలో తేలిందని చెప్పారు.

ఎన్నో అనుమానాలు

వాస్తవంగా ఏ రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేశారో అదే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలి. కానీ ఇక్కడ ఒక రైతు పేరున ధాన్యం కొనుగోలు చేసి మరో వ్యక్తి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించినట్లు తేలింది. ఇలా జిల్లాలోని సోన్ మండలం కడ్తాల్‌లో నిర్వాహకుడు 60 బస్తాల ధాన్యం కాజేసి రూ.80 వేలు తన ఖాతాలో జమచేసుకున్నారని రైతులు తెలిపారు. జాఫ్రాపూర్‌లో 110 బస్తాలను నిర్వాహకుడు తనతో పాటు ముగ్గురు బినామీల పేరుతో రూ.1.80 లక్షలు స్వాహా చేశారని అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోనూ కొన్ని కేంద్రాలలో నిర్వాహకులు చేతివాటం ప్రదర్శించారని అనుమానాలు ఉన్నాయి.

మేం 2 వేల బస్తాల ధాన్యం పండించాం. డబ్బుల కోసం మా కుటుంబంలోని నలుగురు ఖాతాలు ఇచ్చాం. మా తల్లి లక్ష్మిబాయి పేరున 531 బస్తాలు వేయగా... ఆ డబ్బులు ఆమె ఖాతాలో జమయ్యాయి. కానీ మరో 542 బస్తాల ధాన్యం మా అమ్మ పేరున కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపారు. అందుకు సంబందించిన నగదు వేరే వ్యక్తి ఖాతాలో జమ అయింది. రికార్డులు చూసేంతవరకు మాకు ఈ విషయం తెలియదు.

-క్యామ లక్ష్మణ్, కనకాపూర్

వేరే ఖాతాల్లో డబ్బు జమ

క్యామ లక్ష్మీబాయి 531 బస్తాల ధాన్యాన్ని కేంద్రంలో విక్రయించగా... అబ్దుల్లాపూర్‌లోని ఎస్‌బీఐ ఖాతా నంబర్. 62090280885లో రూ.4.01 లక్షలు జమయ్యాయి. మళ్లీ ఈమె పేరిట మరో 542 బస్తాలు కొనుగోలు చేసినట్లు నమోదైంది. ఆ డబ్బులు కుంటాల మండలంలోని ఓ రైస్ మిల్లరు ఖాతా నంబరు 089110100226304లో రూ.4.09 లక్షలు జమ అయినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. రైతులు క్యామ రమేశ్ వద్ద 480 బస్తాలు, కాడె సాయవ్వ వద్ద 118 బస్తాలు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపిన నిర్వాహకుడు... వీరి డబ్బులను కుంటాల మండలానికి చెందిన ఓ మహిళ ఖాతా నంబరు 62291959141లో రూ.4.47 లక్షలు జమ చేసినట్లు రికార్డులలో ఉంది. ఫలితంగా రైతుల అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. ఇలా గ్రామంలో దాదాపు రూ.30 లక్షల వరకు బినామీల ఖాతాల్లోకి మళ్లాయని రైతులు ఆరోపిస్తున్నారు.

మేం 200 బస్తాల ధాన్యం పండించి కేంద్రంలో విక్రయించాం. కానీ మా డబ్బులతో పాటు అదనంగా 40 బస్తాల డబ్బులు ఎక్కువగా జమయ్యాయి. మమ్మల్ని సంప్రదించకుండానే మా ఖాతాలో వేశారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అని తెలుస్తోంది. ఈ బస్తాలు ఎవరివో డబ్బులు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదు.

-రైతు దేవేందర్, కనకాపూర్

గ్రామంలో రాజకీయాల కారణంగా రైతులు నలిగిపోతున్నారు. నాకు గ్రామంలో రెండెకరాల పట్టా భూమి ఉండగా మిగతా కొంత ఎస్సారెస్పీ ముంపు భూముల్లో ఉంది. ఇందులో 461 బస్తాల ధాన్యం పండించాను. నాకు పట్టా తక్కువగా ఉండడంతో మా స్నేహితుడి పట్టా పేరిట 290 బస్తాల ధాన్యం విక్రయించాను. సంబంధిత డబ్బులు నా ఖాతాలో ఎక్కువ వచ్చాయని చెప్పి కొందరు పెద్దలు నన్ను పిలిపించి నాకు రూ.5 వేలు జరిమానా విధించారు. గ్రామ బహిష్కరణ చేశారు. నాలాగా మొత్తం గ్రామంలో 11 మంది బాధితులున్నారు .

-ఓంకార్ దేవేందర్, రైతు

ఇదీ చదవండి:YSRTP: షర్మిలకు షాక్.. వైతెపాకు ఇందిరాశోభన్ రాజీనామా

Last Updated : Aug 20, 2021, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details