తొమ్మిది రోజులు భక్తులచే విశేష పూజలు అందుకున్న వినాయకుడు.. గంగమ్మ ఒడికి తరలి వెళ్లాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన నిమజ్జనయాత్ర కన్నులపండువగా కొనసాగింది. వివిధ ఆకృతుల్లో ఉన్న వినాయకుని విగ్రహాలు దారిపొడవునా ప్రజలను ఆకట్టుకున్నాయి. గణపతి బప్ప మోరియా అంటూ యువత ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. మహిళలు, యువత నృత్యాలు చేయగా.. పట్టణంలో సందడి నెలకొంది.
కన్నుల పండువగా గణనాథుల శోభాయాత్ర
నిర్మల్ జిల్లాకేంద్రంలో పురవీధుల్లో వినాయకుని నిమజ్జన శోభాయాత్ర వైభవోపేతంగా సాగింది.
కన్నుల పండువగా గణనాథుల శోభాయాత్ర