నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటం వల్ల ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
గడ్డెన్న వాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తిన అధికారులు
ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన్న వాగు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులో నీరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరగా.. మూడు గేట్లు ఎత్తి కిందకు వదులుతున్నారు.
నిర్మల్ జిల్లాలో గడ్డెన్న వాగు ప్రాజెక్టు
ప్రాజెక్టులోకి 6,700 క్యూసెక్కుల నీరు రాగా.. అంతే మొత్తంలో నీటిని కిందకు పంపిస్తున్నారు. మహారాష్ట్రంలో అధికంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వరద వస్తోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.