నిర్మల్ జిల్లా పరిధిలోని 3 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఓ సంఘంగా ఏర్పడ్డారు. జిల్లాలో ఉన్న తోటి విశ్రాంత ఉద్యోగులకు సాయం చేయాలనే ఆలోచనతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రి సిబ్బంది వైద్య సేవలు అందజేశారు. వీటితో పాటు ఎవరికి ఎలాంటి సమస్యలున్నా పరిష్కారానికి చేయూతనందిస్తున్నారు.
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం.. - nirmal district
ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు ఇంట్లోనే ఊరికే కూర్చోలేదు. అందరూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తోటి విశ్రాంత ఉద్యోగులకు సహాయం చేయడం మొదలుపెట్టారు నిర్మల్ జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు.
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం..